ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: 16న సీఎం రేవంత్‌ కోర్టుకు రావాల్సిందే

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:49 AM

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి

  • పరువు నష్టం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ నాయకులు వేసిన క్రిమినల్‌ పరువు నష్టం కేసులో నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో రేవంత్‌ ఐపీసీ 499, 153, 171సీ, 171జీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125 ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఈ కేసు విచారణకు రాగా ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కోర్టుకు రాలేకపోతున్నట్టు సీఎం రేవంత్‌ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గత నెల 21న ఆయన కోర్టుకు రాకపోవడంతో బుధవారం జరిగే విచారణకు తప్పకుండా రావాలని ఆదేశించినా హాజరు కాకపోవడంపై రేవంత్‌ తరఫు న్యాయవాదులను మేజిస్ట్రేట్‌ ప్రశ్నించారు.


వచ్చే నెల 16వ తేదీన జరిగే తదుపరి విచారణకు కచ్చితంగా రావాల్సిందేనని, అలానే రూ.15వేల విలువైన రెండు వ్యక్తిగత పూచీకత్తు బాండ్లను కోర్టుకు సమర్పించాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 4వ తేదీన కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అసత్య వ్యాఖ్యలు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెలిసిందే. అయితే ట్రయల్‌ కోర్టులో నాలుగుసార్లు కేసు వాయిదా పడడంతో వెంకటేశ్వర్లు హైకోర్టు మెట్లు ఎక్కగా జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు ఫిర్యాదును పరిశీలించి, న్యాయం చేయాలని ఆదేశించారు.

Updated Date - Sep 26 , 2024 | 03:49 AM