CPI: ప్రజా తీర్పును కేసీఆర్ గౌరవించాలి: కూనంనేని
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:22 AM
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో ఆయన శుక్రవారం పర్యటించారు.
గజ్వేల్/ సిద్దిపేట అర్బన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సీపీఐ అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అసెంబ్లీలో చర్చిస్తానని, తన వంతు కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీఆర్‌ఎస్, బీజేపీలు రాష్ట్రం లో రహస్య ఏజెండాతో పనిచేస్తూ, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ నెల 26 సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 04:22 AM