Heart Attack: సీపీఐ నేత బాల మల్లేశ్ హఠాన్మరణం
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:31 AM
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్(56) హఠాన్మరణం చెందారు.
హైదరాబాద్, అల్వాల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేశ్(56) హఠాన్మరణం చెందారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుటుంబసభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మల్లేశ్ భౌతికకాయాన్ని యాప్రాల్‌లోని ఆయన నివాసానికి తరలించారు. కాగా, బాల మల్లేశ్ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మల్లేశ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాల మల్లేశ్ మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 01 , 2024 | 04:31 AM