ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: కాళోజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్లు

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:07 AM

ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

  • అట్టహాసంగా ప్రారంభం... అంతలోనే పగుళ్లు

హనుమకొండ టౌన్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. గత నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే నెల రోజులు కూడా కాకముందే పెచ్చులూడిన, పగుళ్లు తేలిన గోడలు దర్శనమివ్వడంతో నాణ్యత విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలదన్నేలా వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామని బీఆర్‌ఎస్‌ హయాంలో హనుమకొండ బాలసముద్రంలో 4.20ఎకరాల స్థలంలో రూ.52కోట్ల అంచనా వ్యయంతో 2014 సెప్టెంబరు 9న కాళోజీ జయంతి రోజున శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దశాబ్ధానికి కూడా కాలేదు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక పెండింగ్‌లో ఉన్న పనులు చకచకా పూర్తిచేసి నవంబర్‌ 19న భవనాన్ని ప్రారంభించారు.

Updated Date - Dec 12 , 2024 | 04:07 AM