ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar: ఆహార నాణ్యతపై ఫిర్యాదులకు.. కలెక్టరేట్లలో ప్రత్యేక విభాగం

ABN, Publish Date - Nov 06 , 2024 | 02:28 AM

ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

  • నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు

  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

  • భద్రకాళి ఆలయానికి భోగ్‌ సర్టిఫికెట్‌ అందజేత

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మంగళవారం వెంగళరావు నగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధుల్లో చిరుతిళ్లు అమ్మే వ్యాపారులకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో దామోదర మాట్లాడారు. ప్రతి హోటల్‌, రెస్టారెంట్‌, ఫుడ్‌ స్టాల్‌, హాస్టల్‌, హాస్పిటల్‌, ఆఫీసులలో ఉండే క్యాంటీన్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.


హోటళ్లు, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచబోతున్నామని వెల్లడించారు. నాచారం ఫుడ్‌ ేసఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో కొత్తగా మూడు ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవి గాక మరో 5 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షించేలా ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాగా, వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానానికి, హైదరాబాద్‌లోని శ్రీ జయలక్ష్మి మాతా యోగా సెంటర్‌ ట్రస్ట్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ భోగ్‌ సర్టిఫికెట్‌ను అందజేశారు. అత్యంత శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసే దేవస్థానాలు, మందిరాలకు ఈ సర్టిఫికెట్‌ ఇస్తారు.

Updated Date - Nov 06 , 2024 | 02:28 AM