Damodara Rajanarasimha: కొనుగోలు నుంచి రోగికి చేరేదాకా ఔషధాల వివరాలు ఆన్‌లైన్‌లో
ABN, Publish Date - Nov 23 , 2024 | 04:46 AM
ప్రభుత్వ ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే ఔషధాలు ఇండెంట్ దగ్గర్నుంచి, రోగులకు చేరే దాకా అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
కొత్తగా 22 సీఎంఎస్‌లు...వారంలో అందుబాటులోకి
ఫుడ్‌సేఫ్టీపై తప్పుడు ప్రచారం వద్దు: మంత్రి దామోదర
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే ఔషధాలు ఇండెంట్ దగ్గర్నుంచి, రోగులకు చేరే దాకా అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుతో, ప్రతి జిల్లాకు ఒక సీఎంఎస్ అందుబాటులోకి వస్తున్నదని అధికారులు మంత్రికి వివరించారు.సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ దవాఖానాల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ ేసఫ్టీ అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఔషధాల కొరతపై పతి ఉమ్మడి జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ చొప్పున పది టాస్క్‌ఫోర్స్ బృందాలను మంత్రి ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు, సీఎంఎ్‌సలను తనిఖీ చేసి నివేదిక తయారు చేశాయి. ఈ నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడిసిన్ ఇండెంట్ దగ్గర్నుంచి, అవి రోగులకు చేరే వరకూ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒకరిని బాధ్యులుగా నియమించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఔషధీ పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. సీఎంఎస్ ఇన్, అవుట్ స్టాక్ వివరాలను కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మందుల పంపిణీ వ్యవస్థకు డిప్యుటీ డీఎంహెచ్‌వోలను ఇంచార్జులుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్‌సేఫ్టీపై హైదరాబాద్ దేశంలోనే చిట్ట చివరన ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. కొంత మంది పనిగట్టుకుని 2022 నాటి డేటాతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫుడ్ ేసఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫుడ్ ేసఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - Nov 23 , 2024 | 04:46 AM