Damodara: వైద్యసేవల హబ్‌గా నిజామాబాద్ జిల్లా
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:06 AM
నిజామాబాద్ జిల్లాను వైద్యసేవల హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్‌లను ప్రారంభించిన మంత్రి దామోదర
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాను వైద్యసేవల హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో రూ.38.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్లను ఆదివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్, కలెక్టర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ పరమైన లోపాలను సరిదిద్దుకొని వచ్చే ఉగాది నాటికి వంద రోజుల ప్రణాళికతో పని తీరులో స్పష్టమైన మార్పు కనిపించేలా పని చేయాలని అధికారులకు సూచించారు.
Updated Date - Dec 23 , 2024 | 04:06 AM