ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నెరవేరిన కంటోన్మెంట్‌ కల!

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:31 AM

దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్‌ వాసుల ఎదురుచూపులు ఫలించాయి..! సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తోపాటు.. దేశంలోని అన్ని కంటోన్మెంట్‌లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది.

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనానికి కేంద్రం అంగీకారం

  • దేశవ్యాప్తంగా కంటోన్మెంట్‌ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే..

  • దేశవ్యాప్తంగా.. కంటోన్మెంట్‌ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే

  • లీజులు/గ్రాంట్లు కూడా అందజేత

సికింద్రాబాద్‌/హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్‌ వాసుల ఎదురుచూపులు ఫలించాయి..! సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తోపాటు.. దేశంలోని అన్ని కంటోన్మెంట్‌లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మునిసిపాలిటీలు/కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిఫెన్స్‌ ఏరియా డైరెక్టర్‌ జనరల్‌ ప్రతిపాదనలు, మంగళ, గురువారాల్లో రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను.. శుక్రవారం ఆమోదిస్తూ.. అన్ని కంటోన్మెంట్ల సీఈవోలకు శనివారం సర్క్యులర్‌(నంబర్‌ 8078) జారీ చేశారు. దీంతో.. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనానికి కీలక ముందడుగు పడినట్లయింది. మంగళ, గురువారాల్లో వర్చువల్‌గా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ హాజరయ్యారు.


కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్‌లో ఉన్న పౌర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీకి ఉచితంగా బదిలీ చేస్తారు. అంటే.. కంటోన్మెంట్‌ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జీహెచ్‌ఎంసీకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్‌లో ఇప్పటికే లీజు/గ్రాంట్‌గా ఇచ్చిన ఆస్తులు కూడా జీహెచ్‌ఎంసీకి వస్తాయి. ఒప్పందాల ప్రకారం.. ఆ లీజులు కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే.. ఆస్తులను అప్పగించేప్పుడు రక్షణశాఖ కార్యాలయాలు, సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్‌ బోర్డు బాధ్యులకు ఉండే సందేహాలను నివృత్తిచేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం తన సర్క్యులర్‌లో సూచించింది.


విలీనం.. రెండోసారి

నిజాం హయాంలో ఈస్టిండియా కంపెనీ సైన్యసహకారంలో భాగంగా ట్యాంక్‌బండ్‌కు అవతలివైపు సికింద్రాబాద్‌లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. భారత్‌లో హైదరాబాద్‌ రాష్ట్రం విలీనం తర్వాత.. కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంది. 1950లలో జిర్రా, మారేడ్‌పల్లి, కలాసిగూడ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. మిగతా పౌర ప్రాంతాలు మాత్రం అప్పటి నుంచి కంటోన్మెంట్‌లో కొనసాగుతూ వస్తున్నాయి. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 350 వరకు బస్తీలు, కాలనీలుండగా.. ప్రస్తుతం 4 లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. అయితే.. రక్షణ శాఖ అధీనంలో ఉండడంతో.. ఈ ప్రాంతాల వాసులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భద్రత పేరుతో గాఫ్‌రోడ్ల మూసివేత.. ఆకా్ట్రయ్‌ ట్యాక్స్‌తోపాటు.. పలు అంశాలను నిరసిస్తూ పౌరులు, స్వచ్ఛంద సేవాసంస్థలు జీహెచ్‌ఎంసీలో పౌర ప్రాంతాల విలీనానికి రెండు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. రక్షణ శాఖ స్థావరాలున్నందున విలీనం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే.. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పౌరుల కోణంలో చర్యలకు ఉపక్రమిస్తూ.. ఓ కమిటీని నియమించింది. కానీ, విలీనం విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదు.


సీఎం రేవంత్‌ చొరవతో..

నగరం నలుమూలల అభివృద్ధి విషయంలో కంటోన్మెంట్‌లోని రక్షణ శాఖ భూములు అడ్డంకిగా ఉంటున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి.. కంటోన్మెంట్‌ అంశాన్ని తేల్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న రక్షణ శాఖ కార్యదర్శి వర్చువల్‌గా నిర్వహించిన కీలక సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ‘‘విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని వివరించారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్‌ ప్రత్యేక చొరవ చూపించారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్‌కు కంటోన్మెంట్‌ సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దాంతో.. అప్పట్లోనే కంటోన్మెంట్‌ విలీనానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక. కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనక రేవంత్‌ క్రెడిట్‌ ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 30 , 2024 | 03:32 AM

Advertising
Advertising