ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NDSE: కాళేశ్వరం బ్యారేజీలపై వివరాలు ఇవ్వట్లే!

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:51 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు నిపుణుల కమిటీకి అందించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ జాప్యం చేస్తోందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమి టీ తెలిపింది.

  • జాతీయ ఆనకట్టల భద్రత సంస్థకు తెలిపిన నిపుణుల కమిటీ

  • వివరాలన్నీ అందించాలని తెలంగాణకు ఎన్‌డీఎ్‌సఏ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు నిపుణుల కమిటీకి అందించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ జాప్యం చేస్తోందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమి టీ తెలిపింది. దీనివల్ల తుది నివేదికను సమర్పించడంలో మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌కు నిపుణుల కమిటీ సభ్యకార్యదర్శి లేఖ రాశారు.


గడువు ముగిసి నెలరోజులు దాటినా.. తాము కోరిన సమాచారం ఇవ్వలేదని, ఈ అంశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శితో చర్చించి, పరీక్షల నివేదికలన్నీ వచ్చేలా చూడాలని నిపుణుల కమిటీ ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ను అభ్యర్థించింది. దీంతో నివేదికలన్నీ అందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు ఎన్‌డీఎ్‌సఏ డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ సిన్హా లేఖ రాశారు. కమిటీ కోరిన వివరాలన్నీ అందించాలని తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 03:51 AM