ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కౌలు రైతు సమస్యల పరిష్కారం ఎప్పుడు?

ABN, Publish Date - Dec 05 , 2024 | 04:44 AM

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్ష ణమే అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా రైతులతో పాటు కౌలు రైతులకు అన్ని విఽధాలుగా ఆదుకోవాలని కోరారు.

  • గత, ప్రస్తుత సర్కార్లకు తేడా లేదు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

  • 6 గ్యారెంటీల్లో హామీ ఇచ్చారు.. అధికారంలోకి వచ్చి ఏడాదైంది

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తోంది: కే శ్రీనివాస్‌

  • ఇందిరా పార్కు వద్ద కౌలురైతుల సమస్యలపై ప్రజాదర్బార్‌ నిర్వహణ

కవాడిగూడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్ష ణమే అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా రైతులతో పాటు కౌలు రైతులకు అన్ని విఽధాలుగా ఆదుకోవాలని కోరారు. బుధవారం సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక, కైలురైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు ఈ సందర్భంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఈ ధర్నాలో మహిళా రైతుల హక్కుల జాతీయ వేదిక కన్వీనర్‌ రుక్మిణి, ప్రొఫెసర్‌ జి హరగోపాల్‌, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్‌ కె శ్రీనివాస్‌, వివిధ సంఘాల నేతలు పశ్య పద్మ, టి సాగర్‌, సామాజిక కార్యకర్త వి రుక్మిణి రావు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వివిద జిల్లాల నుంచి వచ్చిన కౌలు రైతులు తమ సమస్యలను జ్యూరీ సభ్యులకు వివరించారు. గతంఓ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ కౌలు రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం సరికాదన్నారు. కౌలు రైతులను గుర్తించడానికి 2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని మహిళా కిసాన్‌ అధికార మంచ్‌ జాతీయ నాయకులు డాక్టర్‌ రుక్మిణి రావు అన్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు తెలంగాణాలో ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, రాహుల్‌ గాంధీ కూడా కౌలు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని సీనియర్‌ సంపాదకులు కే శ్రీనివాస్‌ అన్నారు. ఆరు గ్యారెంటీల్లో కౌలు రైతులను కూడా చేర్చినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తుందని అన్నారు.

Updated Date - Dec 05 , 2024 | 04:44 AM