ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dengue: బెంబేలెత్తిస్తున్న డెంగీ

ABN, Publish Date - Oct 09 , 2024 | 03:50 AM

ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. నిరుటికన్నా మించేకాదు.. ఐదేళ్లలో మునుపెన్నడూ లేని గరిష్టస్థాయిలో డెంగీ కేసులు నమోదయ్యాయి.

  • రాష్ట్రంలో ఐదేళ్ల గరిష్టానికి డెంగీ కేసులు.. నిరుడు 8,016

  • ఈ ఏడాది అక్టోబరు 6వ తేదీ వరకే 9,254 కేసులు

  • బాధితుల్లో వారం పాటు తీవ్రమైన దగ్గు, జ్వరం, నీరసం

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. నిరుటికన్నా మించేకాదు.. ఐదేళ్లలో మునుపెన్నడూ లేని గరిష్టస్థాయిలో డెంగీ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. గత ఏడాది రాష్ట్రంలో 8,016 కేసులు నమోదైతే ఈసారి జనవరి నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు 9,254 డెంగీ కేసులు నమోదయ్యాయి. చికున్‌గున్యా కేసులు కూడా భారీగా ఉన్నా వైద్యశాఖ లెక్కలో కేవలం 379గానే చూపారు. ఈ ఏడాది విపరీతంగా వర్షాలు కురవడంతో పాటు వాతావరణ మార్పులతో వైరల్‌ జ్వరాలు కూడా విజృంభించాయి. దోమలు పెరగడంతోనే డెంగీ కేసులు భారీగా నమోదయ్యాయి. సాధారణంగా డెంగీ, వైరల్‌ ఫీవర్స్‌ జూన్‌ నుంచి మొదలై ఆగస్టులో పెరిగి, సెప్టెంబరులో పతాక స్థాయికి చేరతాయి.


అక్టోబరు మొదటి వారానికి కేసులు తగ్గుముఖం పడతాయి. ఈసారి మాత్రం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. కొన్నిచోట్ల పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈమారు మిక్స్‌డ్‌ వైరల్‌ ఫీవర్స్‌ దాడి చేస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. విష జ్వరాలు, డెంగీలతో మరణాలు సంభవిస్తున్నా అవి వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వైరల్‌ జ్వరాలు, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్‌, గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ కేసులు వస్తున్నాయి. వీటికితోడు దగ్గు, జలుబు, ఫ్లూ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా చలి జ్వరం రోజుల తరబడి ఉంటోంది. దానికితోడు తీవ్రంగా దగ్గు వస్తోంది. రాత్రివేళ నిద్రపోకుండా దగ్గుతూనే ఉండే కేసులు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.


ఇక జ్వర బారినపడితే... కనీసం వారం పది రోజుల పాటు ఉంటోంది. తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం ఉంటోందని రోగులు చెబుతున్నారు. విష జ్వరాల కారణంగా సర్కారు దవాఖానాల్లో ఓపీ బాగా పెరుగుతోంది. అలాగే వార్డులు నిండుతున్నాయి. కాగా రాష్ట్రంలో మళ్లీ వైరల్‌ ఫీవర్స్‌, చికున్‌గున్యా తీవ్రత పెరగడంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యశాఖ విభాగాధిపతులంతా క్షేత్రస్థాయి ఆస్పత్రులకు వెళ్లి పరిశీలించిన నివేదికివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆదేశించారు. దాంతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండి హేమంత్‌, టీశాక్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ హైమవతి, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.వాణి, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రులను సందర్శించారు. అక్కడ వార్డుల్లో కలియదిరుగుతూ విషజ్వరాలు, డెంగీ, చికున్‌ గున్యా కేసుల గురించి ఆరా తీశారు. అలాగే ఒక్కొక్కరు మూడేసి జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిపై సర్కారుకు నివేదికిచ్చారు.


  • నిరుటికన్నా విష జ్వరాలు, డెంగీ కేసులెక్కువే

104 డిగ్రీలతో ఫీవర్‌ ఉండి, ట్యాబ్లెట్‌ వేసుకున్నా తగ్గకపోతే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. అటువంటి రోగుల్లో డీహైడ్రేషన్‌ అయి బీపీ తగ్గి, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. జ్వరం ఉండి ట్యాబ్లెట్‌తో తగ్గిపోతూ...మూడు రోజుల తర్వాత కూడా అటువంటి పరిస్థితే ఉంటే అప్పుడు కూడా వైద్యుడిని స్పందించాలి. సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదు. ప్రస్తుతం మా దగ్గరకు వచ్చే జ్వర కేసుల్లో సగం చికున్‌గున్యా లక్షణాలున్న రోగులే వస్తున్నారు. ఈ ఏడాది ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి ఓపీ చికిత్స సరిపోతోంది. మరికొందరు అడ్మిట్‌ అవుతున్నారు.

- డాక్టర్‌ గొంగూర వెంకటేశ్వర్లు,

క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు,

ఎండీ శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం

నమోదైన కేసుల వివరాలు


సంవత్సరం డెంగీ మలేరియా చికున్‌గున్యా

2020 2173 872 183

2021 7135 881 76

2022 8972 611 104

2023 8016 420 51

2024 9254 229 379

Updated Date - Oct 09 , 2024 | 03:50 AM