ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: పోలీసులు అంకితభావంతో పని చెయ్యాలి

ABN, Publish Date - Nov 22 , 2024 | 03:11 AM

పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్‌ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణలో ఉండాలని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఆయన సూచించారు.

  • స్టేషన్‌కు వచ్చిన వారికి భరోసా ఇవ్వాలి: డీజీపీ

  • రాష్ట్ర వ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్‌ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణలో ఉండాలని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఆయన సూచించారు. 2024 బ్యాచ్‌లో సివిల్‌, ఏఆర్‌, ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ఆయా శిక్షణా కేంద్రాల్లో కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లు గురువారం జరిగాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణా కేంద్రంలో జరిగిన 1211 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు.


అనంతరం కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి మేమున్నామనే భరసో కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న రాజకీయ ప్రేరేపిత హింసను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పని చేయాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. కాగా, శిక్షణలో అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉప్పునూతల సౌమ్య పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. శిక్షణలో ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి డీజీపీ జితేందర్‌ ఈ సందర్భంగా ట్రోఫీలు అందజేశారు. రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో 8,047 మంది 9నెలల కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకుని కొత్తగా విధుల్లోకి చేరుతున్నారని అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ వివరించారు. రాజబహదూర్‌ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీకి ఐఎ్‌సఓ ఫైవ్‌స్టార్‌ సర్టిఫికెట్‌ వచ్చిందని ఆమె తెలిపారు. దేశంలో ఈ తరహా గుర్తింపు దక్కించుకున్న ఏకైక అకాడమీ తమదేనని వెల్లడించారు.

Updated Date - Nov 22 , 2024 | 03:11 AM