TG: ధరణిలో 76 కొత్త మాడ్యూల్స్!
ABN, Publish Date - May 19 , 2024 | 03:12 AM
ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులపై ధరణి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి జూన్ 4వరకు గడువు విధించింది. ఇప్పటి వరకు గుర్తించిన 119 తప్పులను సరిదిద్దేందుకు ధరణి పోర్టల్‌లో కొత్తగా మరో 76 మాడ్యూల్స్ తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. శనివారం సచివాలయంలో ధరణి కమిటీ కన్వీనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన సభ్యులు మాజీ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, కోదండరెడ్డి, మధుసూదన్, భూ చట్టాల నిపుణులు సునీల్, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి ప్రత్యేక సమావేశం అయ్యారు.
అన్నీ తప్పుల సవరణవే
ప్రభుత్వానికి కమిటీ సిఫారసు
4 వరకు పెండింగ్‌కు పరిష్కారం
ధరణిలో 76 కొత్త మాడ్యూల్స్!
అన్నీ తప్పుల సవరణకు సంబంధించినవే
జూన్ 4 వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
పరిశీలించినవి తక్షణమే క్లియర్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు
సమావేశంలో ధరణి కమిటీ నిర్ణయాలు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులపై ధరణి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి జూన్ 4వరకు గడువు విధించింది. ఇప్పటి వరకు గుర్తించిన 119 తప్పులను సరిదిద్దేందుకు ధరణి పోర్టల్‌లో కొత్తగా మరో 76 మాడ్యూల్స్ తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. శనివారం సచివాలయంలో ధరణి కమిటీ కన్వీనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన సభ్యులు మాజీ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, కోదండరెడ్డి, మధుసూదన్, భూ చట్టాల నిపుణులు సునీల్, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి ప్రత్యేక సమావేశం అయ్యారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి గుర్తుచేస్తూ, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు మొదలు పెట్టాలని అధికారులకు సూచించింది.
ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు దాదాపు 76 కొత్త మాడ్యూల్స్‌ను జారీచేయాలని కమిటీ తేల్చి చెప్పింది. 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించగా, 1.45 లక్షల దరఖాస్తులకు సంబంధించిన పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. వీటిని అప్రూవ్, లేదా రిజెక్ట్ చేసేందుకు సంబంధిత నివేదికలను సైతం సిద్థం చేశారు. మార్చి 16న లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ధరణి దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లు ఆపేశారు. మిగిలిన లక్షకుపైగా దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉంది. వీటి పరిశీలనకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాలని కమిటీ పేర్కొంది. ఇప్పటికే పరిశీలించిన వాటిని వెంటనే క్లియర్ చేయాలని కమిటీ సూచించింది. ధరణి పెండింగ్ సమస్యలను జూన్ 4వ తేదీలోపు పరిష్కరించాలని కమిటీ అధికారులకు గడువు విధించింది. రెవెన్యూ యంత్రాగం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. నిషేధిత జాబితా, ఎండోమెంట్, వక్ఫ్‌బోర్డు, భూదాన్
భూముల ఆక్రమాలను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సక్సెషన్, పార్టిషన్, నాలా కోసం, పెండింగ్ నాలా, మ్యుటేషన్, ఎన్‌ఆర్‌ఐ పట్టాదార్ పాస్‌బుక్. గ్రీవెన్స్ రిలేటెడ్ ల్యాండ్ మ్యాటర్, ఆర్గనైజేషన్ పట్టాదార్ పాస్‌బుక్, కోర్ట్ కేసు ఇన్‌టిమేషన్, నాలాకన్వర్శన్, డూప్లికేట్ పాస్ బుక్, జీపీఏ కొరకు అప్లికేషన్, సెమీ అర్బన్ ల్యాండ్ పట్టాదార్ పాస్‌బుక్, కోర్ట్ కేసు ద్వారా పట్టాదార్ పాస్‌బుక్‌లు, విత్ పాస్‌బుక్ నాలా, విత్‌అవుట్ పాస్‌బుక్‌నాలా, ఆధార్ సీడింగ్, గ్రీవెన్స్ రిలేటెడ్ టూ ల్యాండ్ మ్యాటర్, గ్రీవిన్స్ రిలేటెడ్ టూ రాంగ్ ఇంక్లూడింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, ఖాతా మర్జిన్ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొంది. అంతే కాకుండా ఇప్పటికే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలన్నారు. వీటి పరిష్కారంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
Updated Date - May 19 , 2024 | 03:12 AM