ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్

ABN, Publish Date - Sep 23 , 2024 | 08:34 AM

భాగ్యనగరానికి మంచి నీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్-3 రింగ్ మెయిన్ 1 పరిధిలోని ప్రశాసన్ నగర్, అయ్యప్ప సొసైటీ మధ్య మెయిన్ పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సోమవారం మంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ ( Hyderabad Metropolitan Water Supply & Sewerage Board) ప్రకటించింది. దీంతో హకీంపేట, గోల్కండ, టోలీ చౌక్, లంగర్ హౌస్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, తాటీ ఖానా, కొండాపూర్, డోయన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ రోజు మంచి నీటి సరఫరా ఉండదని స్పష్టం చేసింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మంచి నీటి సరఫరా నిలిపిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ ( Hyderabad Metropolitan Water Supply & Sewerage Board) ప్రకటించింది. భాగ్యనగరానికి మంచి నీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్ 3 రింగ్ మెయిన్ 1 పరిధిలోని ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు ఉన్న 1200 డయా పీఎస్పీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయని తెలిపింది.


దీంతో సోమవారం పైప్ లైన్ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో హకీంపేట, గోల్కండ, టోలీ చౌక్, లంగర్ హౌస్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, తాటీ ఖానా, కొండాపూర్, డోయన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ రోజు మంచి నీటి సరఫరా ఉండదని పేర్కొంది.


ఈ మరమ్మతు పనులు.. సోమవారం ఉదయం 6.00 గంటల నుంచి 24 గంటల పాటు.. అంటే మంగళవారం ఉదయం వరకు కొనసాగుతాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ స్పష్టం చేసింది. దీంతో ఆ యా ప్రాంతాలోని ప్రజలు మంచి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని వాటర్ వర్క్ అధికారులు సూచించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 23 , 2024 | 08:34 AM