Hyderabad: నిబ్రస్ డ్రోన్లకు డీజీసీఏ ఆమోదం..
ABN, Publish Date - Jun 28 , 2024 | 05:04 AM
అధునాతన ఫీచర్లతో భూమి సర్వేకు నిబ్రస్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన డ్రోన్ సర్వేయాన్ వి1కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోద ముద్ర వేసింది.
భూ సర్వే అవసరాలు తీర్చేలా ఆధునిక ఫీచర్లు
హైదరాబాద్ సిటీ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): అధునాతన ఫీచర్లతో భూమి సర్వేకు నిబ్రస్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన డ్రోన్ సర్వేయాన్ వి1కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోద ముద్ర వేసింది. 1.99 కిలోల బరువుండే ఈ డ్రోన్‌కు అధిక తరంగ ధైర్ఘ్యం (హై రెజుల్యుషన్) కలిగిన 23 మెగా పిక్సల్ కెమెరా అమర్చి ఉంటుంది. ఫలితంగా అత్యంత స్పష్టమైన చిత్రాలు, డేటాను సేకరించగలదు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాల్లో ఎగరగలదు.
వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ టెక్నాలజీ రంగంలో తమ ఉనికి చాటుకునేలా అధునాతన ఉత్పత్తులను రూపొందిస్తున్నట్లు నిబ్రస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శుభం భరన్వాల్ తెలిపారు. సర్వే పరిశ్రమలో సర్వేయాన్ వీ1డ్రోన్ విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందనే విశ్వాసం వ్యక్తంచేశారు.
Updated Date - Jun 28 , 2024 | 05:04 AM