Medaram: భూకంపం.. ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?
ABN, Publish Date - Dec 04 , 2024 | 07:55 PM
ఆరేళ్ల క్రితం ఈదురు గాలులు.. ఈ ఏడాది ఆగస్టులో పెను గాలులు. లక్షలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. డిసెంబర్ 4వ తేదీ భూప్రకంపనలు వచ్చాయి. ఇవన్నీ మేడారం అటవీ కేంద్రంగా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?
2018లో మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా చిలకలగుట్ట మీద గాలులు బీభత్సం సృష్టించాయి. 2024, ఆగస్టు 31వ తేదీన మళ్లీ అదే మేడారం అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున గాలులు హోరెత్తి పోయాయి. లక్షలాది చెట్లు కూలిపోయాయి. కూకటివేళ్లతో ఎవరో పెకిలించినట్లు కనిపించాయి. 2024 డిసెంబర్ 04 అదే మేడారం అటవీ ప్రాంతంలో భూమి ప్రకంపించింది. వరుస సంఘటలు ఏళ్ల తర్వాత గాలులు వీస్తే.. గాలులు వీచిన కొన్ని మాసాలకే భూకంప ప్రకంపనలు ఇంతకీ అసలేం జరిగింది..? మేడారంపై ప్రకృతి పగబట్టిందా?.. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న వేళ.. జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా, అర్జెంటీనాలాంటి దేశాల్లో వచ్చే టోర్నడోలు ... మేడారం అటవీ ప్రాంతానికి తరలి వచ్చేసినట్లుగా ఉన్నాయి. సాయంత్రం కాగానే అడవుల్లో ఏం జరుగుతోందో ఎవరికీ ఏం తెలియడం లేదు. అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.
అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు, భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నాు. ఇది యాదృశ్చికమేనంటూ వారు కొట్టి పారేశారు. భూమికి 40 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉండటం వల్ల ప్రకంపనల తీవ్రత , నష్టం తగ్గిందని... అదే ఏ పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదంటున్నారు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామూలుగా అయితే ఇండియాలో వాతావరణం వేడిగా, ఉక్కపోతతో ఉంటుంది. ఇలాంటి వాతావరణం ... టోర్నడోలకు అనుకూలం కాదు. కానీ వాతావరణంలో అస్థిరత ఎక్కువైతే ఏమైనా జరగొచ్చు. అమెరికాలో విశాలమైన ప్రాంతాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో టోర్నడో వచ్చినా నష్టం తక్కువే... వాటికి తగ్గట్లే అక్కడ ఇళ్లు నిర్మిస్తారు. కానీ అదే టోర్నడో భారత్‌లో వస్తే మాత్రం ఇళ్లు, వాహనాలు, జంతువుల్ని కూడా గాల్లోకి లేపేస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టం కూడా అధికంగానే ఉంటుంది.
For Telagnana News And Telugu News
Updated Date - Dec 04 , 2024 | 08:14 PM