ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: ‘రైతుభరోసా’కు ఎన్నికల సంఘం బ్రేక్‌!

ABN, Publish Date - May 08 , 2024 | 03:46 AM

రాష్ట్రంలోని రైతాంగానికి ‘రైతుభరోసా’ పేరిట నిధులను విడుదల చేయడంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంక్షలు విధించింది.

  • కానీ.. అప్పటికే దాదాపుగా పూర్తయిన నగదు బదిలీ

  • రైతుభరోసా నిధులు అందాల్సింది 2.86ుమందికే

  • వీరంతా ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్నవారు

  • ఈ రైతులకు 14 నుంచి నగదు బదిలీ చేసే చాన్స్‌

  • ‘రైతుభరోసా’కు ఈసీ బ్రేక్‌!

  • అప్పటికే దాదాపుగా పూర్తయిన నగదు బదిలీ

  • రైతుభరోసా అందాల్సింది 2.86ుమందికే

  • వీరంతా ఎక్కువ విస్తీర్ణం భూమిని కలిగి ఉన్నవారు

  • ఈ రైతులకు 14 నుంచి నగదు బదిలీ చేసే చాన్స్‌

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతాంగానికి ‘రైతుభరోసా’ పేరిట నిధులను విడుదల చేయడంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంక్షలు విధించింది. 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యాకే నిధులు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కానీ.. ఈసీ ఆదేశాలు వచ్చేసరికే రైతు భరోసా కింద నగదుబదిలీ దాదాపుగా (97 శాతం మేర) పూర్తికావడం గమనార్హం. రైతుభరోసా చెల్లింపులు మే 9లోపు పూర్తిచేస్తామంటూ సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగంగా చెప్పారని.. ఆయన వ్యాఖ్యలు మీడియాలో కూడా వచ్చాయని పేర్కొంటూ ఎన్‌. వేణుకుమార్‌ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.


దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్‌.. రైతు భరోసాకు సంబంధించి గతంలో నిర్దేశించిన షరతులను ఉల్లంఘించినట్లు గుర్తించామని పేర్కొంది. టీపీసీసీ చీఫ్‌, ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న సీఎం రేవంత్‌.. రైతు భరోసా పంపిణీపై మాట్లాడి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు స్పష్టమైందని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు బహిరంగంగా మాట్లాడటంతో ఈ నిధుల పంపిణీకి బ్రేక్‌ పడిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 29 నాటికి రాష్ట్రంలో 64,75,319 మంది రైతులకు ఈ పథకం కింద సర్కారు రూ.5,574 కోట్లకు పైగా నగదును బదిలీ చేసింది.


ఈ నెల ఆరో తేదీన మళ్లీ ఈ పథకం కింద నగదు బదిలీని పునఃప్రారంభించిది. 3,27,505 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.986.42 కోట్ల నగదు జమ చేసింది. మంగళవారం కూడా కొందరు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఈలోగా ఈసీ బ్రేక్‌ వేసింది. మొత్తంమీద ఇప్పటివరకు 68,02,824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,561.19 కోట్లకు పైగా నగదు జమ అయింది. ఇంకా సుమారు 2 లక్షల మంది రైతులకు (అంటే 2.86 శాతం మందికి) రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. వీరంతా ఎక్కువ విస్తీర్ణంలో భూమిని కలిగి ఉన్న కేటగిరీ రైతులు. వీరికి కూడా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిధులు సర్దుబాటు చేసింది. కానీ, ఈసీ ఆంక్షల నేపథ్యంలో బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. లేకపోతే బుధవారానికే రైతుభరోసా పంపిణీ పూర్తయ్యేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో.. 14వ తేదీ నుంచి వీరికి రైతుభరోసా నిధులు అందే అవకాశం ఉంది.

Updated Date - May 08 , 2024 | 03:46 AM

Advertising
Advertising