ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED: హీరా కేసులో ఈడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN, Publish Date - Aug 03 , 2024 | 06:10 PM

హీరా గోల్డ్‌ సంస్థల(Heera Group) కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే వేగం పెంచిన ఈడీ.. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తూ వెళ్తోంది.

హైదరాబాద్: హీరా గోల్డ్‌ సంస్థల(Heera Group) కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే వేగం పెంచిన ఈడీ.. నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తూ వెళ్తోంది. తాజాగా హైదరాబాద్ టోలీచౌకిలో ఉన్న ప్లాట్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. టోలీచౌకిలోని ఎంఎస్పీ కాలనీలో ఉన్న రూ.80 కోట్ల విలువైన 81 ప్లాట్లను అధికారులు సీజ్ చేశారు. తాజా ఘటనతో ఇప్పటివరకు రూ.380 కోట్ల పైచిలుకు ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లైంది.

ఇంకా రూ.600 కోట్లకు పైచిలుకు ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నోహిర షేక్‌పై దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితురాలిగా నౌహీరా షేక్‌ ఉంది.


అసలేమైందంటే..

హీరా గోల్డ్‌ సంస్థల కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థలకు చెందిన రూ.33.06 కోట్ల విలువైన 24 స్థిరాస్తుల్ని ఈ ఏడాది మార్చిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ED) అటాచ్‌ చేసింది. ఈ కేసులో ఈడీ గతంలో సుమారు రూ.367 కోట్లు విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

తాజా అటాచ్‌మెంట్‌తో హీరా గోల్డ్‌ కేసులో అటాచ్‌ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.600 కోట్లకు చేరిందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం తిరిగి చెల్లింపులు వస్తాయని నమ్మించి లక్షలాది మంది సాధారణ ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు.


వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని నౌహీరా షేక్‌తోపాటు సంస్థలోని ఇతరులు వ్యక్తిగత అవసరాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించిన ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో విచారణ చేపట్టింన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తుపై ఈడీ వేగం పెంచడంతో హీరా గ్రూప్ సంస్థల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.

Updated Date - Aug 03 , 2024 | 06:10 PM

Advertising
Advertising
<