ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు మెడికల్‌ కాలేజీల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:16 AM

మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.

  • పీజీ మెడికల్‌ సీట్ల బ్లాక్‌పై కన్నెర్ర

  • చల్మెడ, ఎంఎన్‌ఆర్‌ కాలేజీలకు షాక్‌

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మేనేజ్‌మెంట్‌ కోటాలో పీజీ మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. పీజీ నీట్‌లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోటాలోని పీజీ సీట్లను తరచూ బ్లాక్‌ చేస్తున్నారంటూ వరంగల్‌ జిల్లా మట్వాడ పోలీస్‌ స్టేషన్లో కాళోజీ నారాయణరావు వర్శిటీ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.


ఈడీ దర్యాప్తులో ఆ విద్యార్థుల్లో కొందరు తాము మేనేజ్‌మెంట్‌ కోటా కింద పీజీ సీటు కోసం దరఖాస్తే చేసుకోలేదని వెల్లడించారు. కొన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కుమ్మక్కై పీజీ నీట్‌లో అత్యధిక మార్కులు సాధించిన కొందరు విద్యార్థుల సర్టిఫికెట్లను వినియోగించి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను బ్లాక్‌ చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ కేసుకు సంబంధించి చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు సంబంధించి రూ. 3.33 కోట్లు, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీకి సంబంధించి రూ. 2.01 కోట్ల మేరకు ఆయా కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.

Updated Date - Nov 30 , 2024 | 04:16 AM