ED: భూ వ్యవహారంలో మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు
ABN, Publish Date - Nov 06 , 2024 | 02:58 AM
భూ బదలాయింపుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా భూ బదలాయింపుల కేసులో అవసరమైన ఒక్కొక్కరికి ఈడీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది.
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): భూ బదలాయింపుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా భూ బదలాయింపుల కేసులో అవసరమైన ఒక్కొక్కరికి ఈడీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. కొద్ది రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ మూడు రోజులు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.
విచారణ సమయంలో ఆయన నుంచి పలు పత్రాలను సేకరించిన ఈడీ.. తాజాగా మహేశ్వరం మండలం నాగారంలో భూమికి సంబంధించిన వ్యవహారంలో మాజీ ఆర్డీవో వెంకటాచారికి నోటీసులు ఇచ్చింది. నాగారంలో సుమారు 42 ఎకరాల భూ కేటాయింపులకు సంబంధించి ఈడీ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా మాజీ ఆర్డీవోను గురువారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.
Updated Date - Nov 06 , 2024 | 02:58 AM