ED: లోన్ తీసుకొని నిధుల మళ్లింపు
ABN, Publish Date - Jun 06 , 2024 | 09:43 AM
చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఒంగోలు సహా ఆ కంపెనీకి చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చదలవాడ ఇన్ఫ్రా టెక్ మోసం చేసిందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, ఒంగోలు సహా ఆ కంపెనీకి చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చదలవాడ ఇన్ఫ్రా టెక్ మోసం చేసిందని అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి పొందిన నగదును మళ్లించారని అధికారులు గుర్తించారు. చదలవాడ కంపెనీ డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబు, ఇతరులపై సీబీఐ, ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిధులు, మోసం, నేరపూరితతో 166.93 కోట్లు మోసం చేశారని గుర్తించారు.
బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆ నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించారు. ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాలను మళ్లించారని ఈడీ అధికారులు గుర్తించారు. దారి మళ్లించిన నిధులతో థర్డ్ పార్టీలు, డైరెక్టర్లు, కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తులను సంపాదించారని వివరించారు. చదలవాడ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రికవరీ చేశారు. నేరారోపణకు సంబంధించి పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిధులు మళ్లింపునకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని వివరించారు.
Updated Date - Jun 06 , 2024 | 12:05 PM