ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGS RTC Employees : చిన్న తప్పులకే మా ఉద్యోగాలు తీసేశారు

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:13 AM

చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్‌ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు.

  • మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

  • సీఎంకు ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల వినతి

హైద రాబాద్‌ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్‌ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో చిన్న కారణాలతో ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 90 డిపోల్లో సుమారు 450 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు చిన్న తప్పులకే ఉద్యోగం కోల్పోయారని వారి కుటుంబాల నేపథ్యాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వారంతా ఆత్మహత్యలు చేసుకోకముందే తిరిగి విఽధుల్లోకి తీసుకోవాలని, సీఎం రేవంత్‌ తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. కార్మికుల సమస్యలు పట్టని సంస్థ ఎండీ సజ్జనార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 13 , 2024 | 06:14 AM