ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కబ్జా కోరల్లో చెరువులు

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:33 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. జాతీయ రహదారుల వెంబడే కాకుండా ప్రధాన పట్టణాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయి.

  • రాజకీయ నేతలు, అధికారుల అండతో యథేచ్ఛగా ఆక్రమణలు

  • కబ్జాలపై సీఎంకు నకిరేకల్‌ ఎమ్మెల్యే లేఖ

నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. జాతీయ రహదారుల వెంబడే కాకుండా ప్రధాన పట్టణాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయి. రాజకీయనేతలు, అధికారుల అండతో ఈ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నల్లగొండ పట్టణంలో 86 ఎకరాల్లో విస్తరించిన వల్లభరావు చెరువు చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. బీఆర్‌ఎ్‌సకు చెందిన ఒక చోటా నాయకుడు చెరువులో స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించగా.. మరికొందరు సంఘాల నాయకులు స్థలాలను ఆక్రమించుకున్నారు.


నార్కట్‌పల్లి, చిట్యాల, నకిరేకల్‌ మండలాల్లో చెరువులను కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మిర్యాలగూడలో పెద్దచెరువు ఆక్రమణలకు గురవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోనూ చెరువుల ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించి ఆక్రమణలు స్వాధీనం చేసుకునేందుకు వీలుగా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. 65వ నంబరు జాతీయ రహదారి వెంబడి విస్తరించి ఉన్న నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు, నకిరేకల్‌ మండలాల పరిధిలోని చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.


ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో ఊర చెరువు, నాగులకుంట చెరువుల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌ 963లో ఊర చెరువు శిఖం 33.37 ఎకరాలు, సర్వే నంబర్‌ 322లో నాగులకుంట శిఖం భూమి 11.32 ఎకరాల మేర ఉంది. ప్రస్తుతం ఈ భూమి చాలా వరకు ఆక్రమణకు గురైంది. మోత్కూరు చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని రెండు, మూడు ఎకరాలు ఓ వ్యక్తి పేరున పట్టా ఉంది. దాన్ని ఆయన 20 ఏళ్ల క్రితమే విక్రయించగా, కొందరు చిన్న వ్యాపారులు కొని ఇళ్లు నిర్మించుకున్నారు.


భువనగిరి పెద్ద చెరువు 200 ఎకరాల్లో ఉండగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలు అతిక్రమించారంటూ ఇరిగేషన్‌ అధికారులు మూడు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలోని కోదాడలో పెద్దచెరువు విస్తీర్ణం మొత్తం 720 ఎకరాల్లో 300 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలు జరిగినట్టు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 1,225కు పైగా చెరువులు ఉండగా 24కి పైగా చెరువులు 50శాతానికి పైగా, 100లోపు నీటి కుంటలు సైతం ఆక్రమణలకు గురయ్యాయని తెలుస్తోంది.

Updated Date - Aug 27 , 2024 | 03:33 AM

Advertising
Advertising
<