ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan Waiver: రుణమాఫీ పథకం బోగస్‌ :ఈటల

ABN, Publish Date - Aug 17 , 2024 | 04:56 AM

రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్ధం లేదని, అంతా బోగస్‌ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పథకాన్ని అమలు చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడంలో అర్ధం లేదని, అంతా బోగస్‌ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రుణమాఫీపై ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేకయిందని విమర్శించారు. ఇప్పుడు సీఎంవో నుంచి విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను కూడా నమ్మేట్టు లేదన్నారు.


రుణమాఫీ పథకాన్ని సమగ్రంగా అమలు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ లక్షలాది మంది రైతులు ఆందోళనతో ఉన్నారని, వారికి తక్షణం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతోందని ఈటల దుయ్యబట్టారు. దీనిని తక్షణం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న పట్టా భూముల్లో నిర్మాణాలను కూల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 17 , 2024 | 04:56 AM

Advertising
Advertising
<