ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: గుండు సున్నా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:55 PM

పండగ వేళ.. అక్కచెల్లెమ్మలను నిరుత్సాహపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించి.. అవి ఇవ్వకుండా గుండు సున్నా చుట్టాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని చెప్పి.. పేద గర్భిణీలను సైతం మోసం చేశాడని చెప్పారు. ముదిరాజ్, గంగాపుత్రులంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆయన ఆరోపించారు.

BRS Leader Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో తీసుకు వచ్చిన పథకాలను బంద్ చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని వ్యంగ్యంగా అన్నారు. గతంలో దసరా, బతుకమ్మ పండగల వేళ.. ఒక చీర కాదు.. రెండు చీరలు ఇస్తామన్నాని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Also Read: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుంది.. జస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి..!


పండగ వేళ.. అక్కచెల్లెమ్మలను నిరుత్సాహపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించి.. అవి ఇవ్వకుండా గుండు సున్నా చుట్టాడని విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని చెప్పి.. పేద గర్భిణీలను సైతం మోసం చేశాడని చెప్పారు. ముదిరాజ్, గంగాపుత్రులంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆయన ఆరోపించారు. ఆగస్ట్‌లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చిన పోయలేదన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము రూ. 100 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ రేవంత్ సర్కార్ చేప పిల్లల కోసం బడ్జెట్‌లో పెట్టింది.. కేవలం రూ .16 కోట్లు మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. వర్షా కాలంలో చెరువులు నిండుకుండలా ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ చేప పిల్లల సగమే పోయాలంటున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పు అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.


రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరి 10 మాసాలు దాటింది. అయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులో ఈ సర్కార్ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. అలాగే తెలంగాణలో చెరువులు, నాలలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. అందులోభాగంగా హైడ్రాను ఏర్పాటు చేసింది.


అయితే ఈ హైడ్రా కారణంగా మధ్యతరగతి, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతల నిప్పులు చెరుగుతున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై సైతం ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు.. అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.

For Telangana News And Telugu News...

Updated Date - Oct 16 , 2024 | 03:55 PM