ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam : సలామ్‌ సుభాన్‌

ABN, Publish Date - Sep 04 , 2024 | 06:20 AM

సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ.. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్‌ హీరోలుగా నిలుస్తుంటారు.

  • ఖమ్మం వరదలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌

  • పోతే ఒక్కడినే తిరిగొస్తే 9 ప్రాణాలంటూ సాహసం

  • మరో ముగ్గురి సహకారంతో రక్షించిన వైనం

ఖమ్మం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ.. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్‌ హీరోలుగా నిలుస్తుంటారు. హరియాణాకు చెందిన సుభాన్‌ అనే ఎక్సకవేటర్‌ డ్రైవర్‌ కూడా ఓ రియల్‌ హీరోనే.. దివ్యాంగుడైనా ప్రకృతిని సవాలు చేస్తూ వరదకు ఎదురెళ్లి ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రాణాలను కాపాడాడు. పోతే ఒక్కడినే.. తిరిగొస్తే తొమ్మిది ప్రాణాలతో వస్తా.. అనే సంకల్పంతో సాహసం చేసి ఖమ్మంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించి ప్రజలందరితోనూ సలామ్‌ కొట్టించుకున్నాడు సుభాన్‌.. ఆ తొమ్మిది మందిని రక్షించడంలో సుభాన్‌కు మరో ముగ్గురు కూడా సహకరించారు. వివరాల్లోకి వెళ్లితే... ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరికి చెందిన ఓజుబోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మంలోని మున్నేరు నదీ తీరంలో చికెన్‌ షాప్‌ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయా దుకాణాల్లో 20 మంది వరకు పని చేస్తుండగా వాళ్లలో ఎనిమిది మంది ఆ దుకాణాల వెనకే నివాసముంటారు.

ఎప్పట్లాగే వారంతా ఆదివారం ఉదయం కూడా దుకాణాలు తెరిచారు. కానీ, భారీ వర్షాలకు మున్నేరు పొంగడంతో ఉదయం ఎనిమిద్నర ప్రాంతంలో వరద నీరు ఆ దుకాణాలను తాకింది. చికెన్‌ కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి వరదలో మునిగిపోతుండగా పోలీసులు అతన్ని కాపాడారు. అనంతరం ఆయా దుకాణాల్లో పని చేసే ఎనిమిది మంది అక్కడే ఉండే మరో యువకుడు కలిసి ప్రకా్‌షనగర్‌ వంతెన దాటేందుకు ప్రయత్నించగా వరద పోటెత్తింది. వారు సగం దూరం వెళ్లేసరికి వెంకటగిరి వైపు కూడా వరద ముంచెత్తగా ఆ తొమ్మిది మంది అక్కడే వంతెనపై ఉండిపోయారు. వాళ్లని రక్షించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. హెలికాప్టర్లు తెప్పించేందుకు యత్నించింది. చాయి. కానీ, ప్రతికూల వాతావరణం వల్ల అది సాధ్యం కాలేదు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు.


ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రకాష్‌ నగర్‌ వైపు నుంచి తాడు సహాయంతో బాధితుల దగ్గరికి వెళ్లేందుకు విఫలయత్నం చేశాయి. అనంతరం పడవలను సిద్ధం చేసినా బాధితులను చేరుకోలేకపోయాయి. ఈలోగా సమయం రాత్రి 11 గంటలు కాగా...వంతెనపైన ఉన్నవారిని రక్షించేందుకు హరియాణాకు చెందిన సుభాన్‌ ముందుకొచ్చాడు. పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చిన సుభాన్‌ తన ఎక్స్‌కవేటర్‌తో వంతెనపైకి వెళ్లాడు. కొంతదూరం వెళ్లేసరికి నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వాహనాన్ని ఆపేశాడు. అయితే, సుభాన్‌తో పాటు వెళ్లిన జవహర్‌లాల్‌, ఉపేందర్‌, నాగేశ్వరరావు... వంతెన పక్కన ఓ చెట్టుకు తాడు కట్టి.. దాని సాయంతో వరదలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లారు. తిరిగి అదే తాడు సాయంతో ఒక్కొక్కరిని ఎక్స్‌కవేటర్‌ వద్దకు చేర్చగా.. సుభాన్‌ అందరినీ సురక్షితంగా వరద నుంచి బయటికి తీసుకొచ్చాడు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా సుభాన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.

  • వేరే వ్యక్తికి బీఆర్‌ఎస్‌ నేతల సత్కారం

వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఖమ్మం వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు సుభాన్‌ విషయంలో పొరపాటు పడ్డారు. తొమ్మిది మందిని కాపాడిన ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌ సుభాన్‌ అనుకొని మరో వ్యక్తిని అభినందించి సన్మానించారు. సుభాన్‌ వల్ల వరద నుంచి బయటపడిన ఈ విషయం చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు నన్మానించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని పేర్కొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 06:20 AM

Advertising
Advertising