Pending Bills: సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:02 AM
గ్రామ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజామాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు.
లేదంటే చలో పల్లెబాట: తాజా మాజీ సర్పంచుల జేఏసీ
పంజాగుట్ట, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజామాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేతలు స్వయంప్రభ, అంజయ్య, గంగాధర్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా రావాలని చెప్పారు.
ఆస్తులు అమ్ముకుని, బంగారు ఆభరణాలు కుదువ పెట్టి అప్పులు తెచ్చి పనులు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పెండింగ్ బిల్లులు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా పల్లెబాట కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం తీరును ఎండగడతామని హెచ్చరించారు. అయినా స్పందన రాకపోతే ఈ నెల 27న అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు.
Updated Date - Dec 09 , 2024 | 04:03 AM