Fake Seeds: నిర్మల్ జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాల పట్టివేత
ABN, Publish Date - Nov 03 , 2024 | 04:57 AM
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లి కె ఎక్స్ రోడ్డు వద్ద శనివారం మండల విస్తరణాధికారి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు.
నర్సాపూర్ (జి), నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లి కె ఎక్స్ రోడ్డు వద్ద శనివారం మండల విస్తరణాధికారి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. భైంసా మండలం చాత గ్రామానికి చెందిన చందుల మహేశ్ అనే వ్యక్తి విత్తనాల బస్తాలను బైక్‌పై తీసుకెళుతుండగా గమనించి, అనుమానం వచ్చి పరిశీలించగా అవి నకిలీవని తేలింది. మొక్కజొన్న బ్యాగులపై ఉన్న క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేయగా వివరాలు రాలేదు.
బస్తాలపై బ్యాచ్ నెంబర్ కూడా లేకపోవడంతో స్థానికంగా ఉన్న పయనీర్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్‌ను పిలిపించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. పట్టుకున్న మొక్కజొన్న విత్తనాల విలువ రూ.71 వేల వరకు ఉంటుందని అధికారి తెలిపారు.
Updated Date - Nov 03 , 2024 | 04:57 AM