MLC Kavitha: తప్పుడు కేసు పెట్టారు.. న్యాయపరంగా పోరాడుతా: ఎమ్మెల్సీ కవిత
ABN, Publish Date - Mar 23 , 2024 | 01:14 PM
MLC Kavitha: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam Case) కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత.. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు.
MLC Kavitha: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam Case) కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత.. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు. విచారణ సమయంలో అడిగిందే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని అన్నారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడుతామని అన్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు వారం రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గడువు శనివారంతో ముగిసింది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది ఈడీ. కవితను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని కోర్టుకు ఈడీ వివరించింది.
కవితను చూసేందుకు వచ్చిన భర్త, కుమారులు, నేతలు..
ఈడీ కస్టడీలో ఉన్న కవితను చూసేందుకు ఆమె భర్త అనిల్, ఇద్దరు కుమారులు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా కోర్టు వద్దకు వచ్చారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, పలువురు జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 23 , 2024 | 01:15 PM