ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nizamabad: అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను వివస్త్రలను చేస్తాం

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:04 AM

‘తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకుంటే నీ భార్య కూతురిని విడిచిపెట్టం.. అందరిలో వివస్త్రలను చేస్తాం’ అంటూ వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు దిగడంతో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

  • వడ్డీ వ్యాపారుల వేధింపులతో గోదావరిలో దూకిన కుటుంబం

  • తండ్రీకూతురు మృతి.. తల్లిని కాపాడిన స్థానికులు.. మృతులది నిజామాబాద్‌

బాసర/ఖిల్లా (నిజామాబాద్‌), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకుంటే నీ భార్య కూతురిని విడిచిపెట్టం.. అందరిలో వివస్త్రలను చేస్తాం’ అంటూ వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు దిగడంతో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తండ్రీకూతురు మరణించగా.. తల్లిని స్థానికులు కాపాడారు. బాధితురాలి కథనం మేరకు.. నిజామాబాద్‌ న్యాల్‌కల్‌రోడ్డులో ఉప్పులంచి వేణు (50) భార్య అనురాధ, కూతురు పూర్ణిమ (24)తో కలిసి నివాసముంటున్నాడు. అక్కడి గంజ్‌లోనే వేణు చిరు వ్యాపా రం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే వ్యాపార నిమిత్తం స్థానిక వడ్డీ వ్యాపారులు రోషన్‌, వికాస్‌ వద్ద రెండేళ్ల కింద రూ.3 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ మొత్తానికి వడ్డీతో సహా అసలు చాలావరకు వేణు చెల్లించాడు.


అయితే దాన్నంతా వడ్డీ, చక్రవడ్డీల కింద జమ చేసుకున్న వ్యాపారులు.. అప్పు తీరలేదంటూ వడ్డీతో కలిపి ఇవ్వాలంటూ వేధించసాగారు. ఇవ్వకుంటే భార్యాకూతుళ్లను అందరిలో వివస్త్రలను చేస్తామని హెచ్చరించారు. వ్యాపారంలో నష్టాలు.. వడ్డీ వ్యాపారుల వేధింపులు.. తీవ్ర మనస్తాపం చెందిన వేణు కుటుంబ సభ్యులు.. నిర్మల్‌ జిల్లాలోని బాసరవద్ద గోదావరిలో దూకారు. స్థానిక జాలరులు.. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వేణు, పూర్ణిమ అందులో గల్లంతవ్వగా.. అనురాధను అతి కష్టమ్మీద రక్షించారు. చివరకు వేణు మృతదేహం లభించగా.. పూర్ణిమ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనురాధను చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బాసర ఎస్సై గణేశ్‌ తెలిపారు.

Updated Date - Nov 07 , 2024 | 04:04 AM