ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FGG : కూల్చివేతల్లో నష్టపోయిన వారికి బిల్డర్ల నుంచి పరిహారం

ABN, Publish Date - Aug 28 , 2024 | 06:23 AM

అక్రమ కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేస్తున్న కారణంగా నష్టపోయే పేద, మధ్య తరగతి ప్రజలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) డిమాండ్‌ చేసింది.

  • ఎఫ్‌జీజీ డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అక్రమ కట్టడాలను ‘హైడ్రా’ కూల్చివేస్తున్న కారణంగా నష్టపోయే పేద, మధ్య తరగతి ప్రజలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) డిమాండ్‌ చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రికి ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం లేఖ రాశారు. బిల్డర్లు అపార్ట్‌మెంట్లు, విల్లాలను నిర్మించి విక్రయిస్తుంటారని, ఈ స్థలాలు, భూ ములను రిజిస్ట్రేషన్‌ చేయించి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల నుంచి తగిన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారని తెలిపారు.

కానీ కొనుగోలు చేసిన పదేళ్ల తర్వాత.. ఆ స్థలాలు, భూములు చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయంటూ హైడ్రా కూల్చివేస్తోందన్నారు. హైడ్రా చర్యలను స్వాగతించాల్సిందేనని, అయితే.. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు బిల్డర్ల కారణంగా నష్టపోతున్నారని తెలిపారు. బిల్డర్లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ, తప్పుడు అనుమతులిచ్చిన హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 28 , 2024 | 06:24 AM

Advertising
Advertising
<