ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: కడియం నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు

ABN, Publish Date - May 29 , 2024 | 04:16 AM

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు.

ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఆయనే కారణం

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, మే 28: బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు. మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు కేరాఫ్‌ కడియం అని, తన ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి, పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడానికి, మొన్నటికి మొన్న వరంగల్‌ ఎంపీ టికెట్‌ సైతం రాకపోవడానికి కడియమే కారణమని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో కడియం దిట్ట అని, నాడు ఎన్టీఆర్‌ను, చంద్రబాబును, నేడు కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచారన్నారు.

తాను రాష్ట్ర సాధన కోసం నాడు పార్టీ మారితే, కడియం తన రాజకీయ స్వార్థం కోసం మారారని మండిపడ్డారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలువాలని సవాల్‌ చేశారు.

Updated Date - May 29 , 2024 | 04:18 AM

Advertising
Advertising