సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ వెన్నెల బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:14 AM
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి పర్యాటక,
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి, విమలా గద్దర్, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ప్రజలను చైతన్యం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం ఇనుమడించే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. గద్దర్ అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ వెన్నెలను సాంస్కృతిక కళా సారఽథి చైర్‌పర్సన్‌గా నియమించి సముచిత స్థానం కల్పించారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆట, పాటకు ఆదరణ దక్కలేదని, కళాకారులకు సరైన గుర్తింపు లేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో కళాకారులందరికీ సముచిత గౌరవం లభిస్తున్నదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Updated Date - Nov 26 , 2024 | 04:14 AM