ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోమోస్‌ తయారీ కేంద్రాలపై దాడులు

ABN, Publish Date - Oct 30 , 2024 | 04:13 AM

కలుషిత మోమోస్‌ కారణంగా ఓ గృహిణి మృతిచెందగా.. 50 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

  • 110చోట్ల పరిశీలన.. 69 నమూనాలు ల్యాబ్‌కు

  • బాధితులను పరామర్శించిన అధికారులు

  • అదుపులోకి మరో ఆరుగురు నిందితులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కలుషిత మోమోస్‌ కారణంగా ఓ గృహిణి మృతిచెందగా.. 50 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 110 మోమోస్‌ తయారీ కేంద్రాలపై ముప్పేట దాడులు నిర్వహించి, తనిఖీ చేపట్టారు. అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో మోమో్‌సను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పురుగులు పట్టిన మైదా పిండి, కాలం చెల్లిన ముడిపదార్థాలను మోమోస్‌ తయారీకి వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. కొన్ని తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రత, డ్రైనేజీ ఓవర్‌ఫ్లో వంటి పరిస్థితులను గుర్తించారు. 69 కేంద్రాల్లో మోమోస్‌ నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చాక.. సంబంధిత మోమోస్‌ తయారీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్‌ ఎస్‌.పంకజ వెల్లడించారు. కాగా.. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో మోమోస్‌ తిని అస్వస్థతకు గురై, తన్వీర్‌, స్వాతి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పరామర్శించారు.

వారి నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు తరలించారు. అస్వస్థతకు కలుషితమైన మోమోస్‌ కారణమా? లేక అందులో వినియోగించిన మయోనైస్‌ కారణమా? అనేది నివేదిక వచ్చాక తెలుస్తుందని అధికారులు వివరించారు. మరోవైపు.. కలుషిత మోమోస్‌ కేసులో బంజారాహిల్స్‌ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరంతా ఢిల్లీ మోమోస్‌ నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసి.. సంతల్లో విక్రయిస్తుంటారని పోలీసులు వివరించారు.

Updated Date - Oct 30 , 2024 | 04:13 AM