ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Government: తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్..

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:10 PM

తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాల్లోని స్కూళ్లకు ఈ నేపథ్యంలో నేడు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలోని పరిస్థితులకనుగుణంగా అన్ని జిల్లాల అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.


మరోవైపు పంజాగుట్టలోని సుఖ్ నివాస్ అనే అపార్ట్‌మెంటుపై పిడుగు పడింది. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు రైలింగ్‌పై పిడుగు పడింది. దీంతో రైలింగ్ గోడ కూలి శకలాలు కింద పడ్డాయి. శకలాలు కింద పడడంతో అపార్ట్‌మెంట్ గేటు ముక్కలైంది. కారుతో పాటు కారు పార్కింగ్ షెడ్ కూడా ధ్వంసమైంది. ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు పెద్ద శబ్దంతో పిడుగు పడింది. సుఖ్ నివాస్ అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు వర్షం కారణంగా నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


పలు ప్రాంతాల్లో వర్షానికి చెట్లు పడిపోవడంతో ఆయా ఏరియాల్లో మరమ్మతుల కారణంగా కరెంటును నిలిపివేశారు. ఇక వర్షం ధాటికి వాహనాలు.. వాహనాలతో పాటు మనుషులు సైతం కొట్టుకుపోతున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతుండటంతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్‌కు వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతవాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మునిగిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి హఫిజ్ పేట్, మాదాపుర్, గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి వచ్చి చేరుతోంది. గచ్చిబౌలి సుదర్శన్ నగర్ కాలనీలో వరద నీరు భారీగా చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. హఫిజ్ పేట్ నుంచి మాదాపుర్ హైటెక్ సిటీ మార్గంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Updated Date - Aug 20 , 2024 | 02:10 PM

Advertising
Advertising
<