ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Governor Jishnu Dev Varma: ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి.. ‘యాదాద్రి’

ABN, Publish Date - Aug 30 , 2024 | 04:33 AM

ఆధ్యాత్మికం, సాంస్కృతికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు.

  • జిల్లాలో మహిళా సంఘాల పనితీరు బాగుంది

  • ఉపాధి పనుల్లో ప్రగతి భేష్‌: గవర్నర్‌ జిష్ణుదేవ్‌

యాదాద్రి/జనగామ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికం, సాంస్కృతికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఆలేరు మండలం కొలనుపాకలోని జైనమందిరం, సోమేశ్వరాలయం, భువనగిరిలోని స్వర్ణగిరిలోని వేంకటేశ్వరుడి ఆలయాలను దర్శించుకున్నారు. తిరుపతి తరహాలో స్వర్ణగిరి క్షేత్ర నిర్మాణం మహాద్భుతమని కొనియాడారు. అనంతరం భువనగిరి కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జిల్లా అధికారులతో గవర్నర్‌ సమావేశమయ్యారు.


జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు చాలా ప్రభావవంతంగా ఉందని, ఉపాధి హామీ పనుల్లో అధికంగా పనులు కల్పించడం అభినందనీయమన్నారు. స్వతంత్ర సమరయోధుడు మన్నె గోపాల్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూరెళ్ల విఠలాచర్య, కేతావత్‌ సోమ్లానాయక్‌లను గవర్నర్‌ శాలువాతో సత్కరించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న తనకు జనగామ జిల్లా సందర్శన చాలా సంతృప్తినిచ్చిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు.


వీలైతే త్వరలోనే జనగామకు మళ్లీ వస్తానని చెప్పారు. మూడు రోజుల ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం జనగామ జిల్లాలో గవర్నర్‌ పర్యటించారు. జనగామ కలెక్టరేట్‌లో కవులు, కళాకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల పనితీరును గవర్నర్‌ తెలుసుకున్నారు. అనంతరం జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపూర్‌లోని వెంకటేశ్వరస్వామి 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. తన కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వగ్రామానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

Updated Date - Aug 30 , 2024 | 04:33 AM

Advertising
Advertising