ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘రామచిలుక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌..

ABN, Publish Date - Jul 01 , 2024 | 03:30 AM

గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై వివిధ కథాంశాలతో ‘రామచిలుక’ పేరిట రచించిన తెలుగు అనువాద కథల సంపుటిని రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు.

బేగంపేట, హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిళ్లై వివిధ కథాంశాలతో ‘రామచిలుక’ పేరిట రచించిన తెలుగు అనువాద కథల సంపుటిని రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత శ్రీధరన్‌ పిళ్లైని ప్రశంసించారు. రామచిలుక పుస్తకం రచయిత బహుముఖ ప్రజ్ఞకు, శ్రేష్ఠతకు, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.


గాయం, న్యాయం, చేపచిక్కాలంటే , రామచిలుక, సాయంసంధ్య, ఆత్మఛాయ, స్త్రీనైజం వంటి శీర్షికలతో ఏడు కథల సంపుటితో రాసిన ఈ పుస్తకం పాఠకుల ఆదారణ పొందాలని రాధాకృష్ణన్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, గోవా గవర్నర్‌ కార్యదర్శి యం.ఆర్‌.యం.రావు, ప్రొఫెసర్‌ కొలకలూరి ఇనాక్‌, పద్మశ్రీ గ్రహీత కె. శివారెడ్డి, కవి, రచయిత ఎన్‌. రామచందర్‌రావు, పుస్తకం తెలుగు అనువాదకులు ఎల్‌.ఆర్‌.స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 03:30 AM

Advertising
Advertising