ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: 100 రోజులన్నారు.. 300 రోజులైంది

ABN, Publish Date - Nov 03 , 2024 | 03:33 AM

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతోపాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

  • 2 లక్షల ఉద్యోగాల హామీలో 10 శాతం కూడా భర్తీ చేయలే

  • అర్హులైన రైతుల్లో సగానికి పైగా రుణమాఫీ కాలేదు

  • నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ తప్పుడు ప్రచారం

  • వైఫల్యాలను విజయాలుగా చూపెట్టడం సిగ్గుచేటు

  • రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు

  • మాజీ మంత్రి హరీశ్‌ ధ్వజం ముఖ్యమంత్రి ట్వీట్‌కు కౌంటర్‌

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతోపాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు స్పందించిన హరీశ్‌ రావు... సీఎం పేర్కొన్న అంశాలను తప్పుబడుతూ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలనే కాక దేశాన్నే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులు భర్తీ చేసిందన్నారు. కానీ ఈ నియామకాలపై సీఎం తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని హరీశ్‌ వాపోయారు. ఎన్నికల కోడ్‌ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను ఇచ్చి ఆయా నియామకాలు తామే చేసినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.


అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పటిదాకా కనీసం పది శాతం ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని పేర్కొన్నారు. 2023 డిసెంబరు 9 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా.. అర్హులైన రైతుల్లో సగం కంటే ఎక్కువ మంది ఇంకా మాఫీ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు. పెన్షన్‌, మహిళలకు ఆర్థిక సాయం, విద్యా భరోసా, పంట బోనస్‌, కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి ఏ ఒక్క హామీని ప్రభుత్వం ఇప్పటిదాకా నెరవేర్చలేదని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని ప్రకటించారని, ప్రభుత్వ ఏర్పాటై 300 రోజులు కావొస్తున్న హామీలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో వాస్తవాలు ఇలా ఉంటే.. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్‌ మాత్రం తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫలయత్నం చేస్తూ దేశ ప్రజలను మభ్యపెట్టడం సిగ్గుచేటని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 03:33 AM