ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: కాంగ్రెస్‌ కండువా కప్పుకోకుంటే కేసులా?

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:12 AM

‘‘కాంగ్రెస్‌ కండువా కప్పుకోండి.. కాదు.. లేదంటే.. మీపై అక్రమ కేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం.. మిమ్మల్ని టార్గెట్‌ చేస్తాం’’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

  • రేవంత్‌ సర్కార్‌ మా ఎమ్మెల్యేలను వేధిస్తోంది

  • హైడ్రాతో రాజకీయం: హరీశ్‌

  • నా మెడికల్‌ కాలేజీని కూల్చేందుకు కుట్ర: పల్లా

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ కండువా కప్పుకోండి.. కాదు.. లేదంటే.. మీపై అక్రమ కేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం.. మిమ్మల్ని టార్గెట్‌ చేస్తాం’’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్‌ సర్కారు రాజకీయాలు చేస్తోందని, రాజకీయంగా ఎదుర్కొనలేకనే వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.


మొన్న పటాన్‌చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్‌ కేసు పెట్టి.. రూ.300 కోట్ల జరిమానా వేసి ఇబ్బందులకు గురిచేసి.. కాంగ్రె స్‌ కండువా కప్పారని, ఆ వెంట నే మైనింగ్‌ కేసు అటకెక్కించారన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆరు కేసులు పెట్టారని, పల్లాతోపాటు ఆయన భార్య, పిల్లలపైనా కేసులు పెట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లక్ష్యంగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో రాజకీయ కుట్ర చేస్తోందని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీలు ప్రభుత్వ భూమిలో ఉంటే బయటపెట్టాలని, 24గంటల్లో ఆయనే వాటిని తొలిగిస్తారని చెప్పారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆస్పత్రులపై రుద్దడం తగదని ఆయన అన్నారు.


ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దాడి చేస్తోందని, 9 నెలలుగా తనపై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తాను 25 ఏళ్ల క్రితమే విద్యాసంస్థలు ప్రారంభించానని, అక్రమ నిర్మాణాలంటూ తన మెడికల్‌ కాలేజీని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేపట్టామని, కబ్జా చేశానని నిరూపిస్తే వాటిని కూల్చడానికి కూడా సిద్ధిమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే వేధింపులు భరించలేక గొంతుకోసుకొని ఆత్మహత్యా యత్నం చేసి యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నస్పూర్‌ మునిసిపల్‌ కౌన్సిలర్‌ బేర సత్యనారాయణను హరీశ్‌రావు ఆదివారం పరామర్శించారు. అదే ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ నేత జిట్టా బాలకృష్ణరెడ్డినీ ఆయన పరామర్శించారు.

Updated Date - Aug 26 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<