ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao,: పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Nov 18 , 2024 | 03:06 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మద్దతు ధర దక్కక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి రైతులతోపాటు కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇరు ప్రభుత్వాలు తక్షణం పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

  • గురుకులాల్లో చావులకు సీఎందే బాధ్యత: హరీశ్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మద్దతు ధర దక్కక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పత్తి రైతులతోపాటు కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇరు ప్రభుత్వాలు తక్షణం పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ‘కౌలు రైతులకు కాంగ్రెస్‌ అమలు చేస్తానన్న రైతుభరోసా సంగతి దేవుడెరుగు.. వారు పండించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితిని గుర్తించి వారికి మద్దతుగా నిలవాలి’ అని ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు.


ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్లు, ఆత్మహత్యలు పెరిగి మరణ మృదంగం వినిపిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ 11 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడిందని.. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 03:06 AM