ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kavitha: కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:22 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిహాడ్‌ జైలులో కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌ అయ్యారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు కలిశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిహాడ్‌ జైలులో కవితతో హరీశ్‌ రావు ములాఖత్‌ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు కవితతో మాట్లాడారు. కవిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా గైనిక్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షలు, జైలులో వసతులు, మందులు తదితర అంశాలపై కవితతో హరీశ్‌ రావు చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 27న కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ సారి తప్పనిసరిగా బెయిల్‌ వస్తుందని, ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించామని కవితకు హరీశ్‌ రావు ధైర్యం చెప్పినట్టు సమాచారం.

Updated Date - Aug 24 , 2024 | 03:22 AM

Advertising
Advertising
<