Harish Rao: రేవతి మరణానికి పాలకులే కారణం
ABN, Publish Date - Dec 14 , 2024 | 03:30 AM
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సినిమా చూడడానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం స్పందించాలి: హరీశ్
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సినిమా చూడడానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. అయితే, రేవతి మరణానికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని, చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వంపైనేని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు ? ముందు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించి ఎవరు? అని హరీశ్ ప్రశ్నించారు. జరిగిన ఘటనతో ప్రత్యక్షంగా సంబంధం లేని అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు సీఎం సోదరులను ఎందుకు అరెస్టు చెయ్యరని నిలదీశారు. సీఎం సోదరుల వేధింపులు తాళలేక చనిపోతున్నానని లేఖ రాసి కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు.
Updated Date - Dec 14 , 2024 | 03:30 AM