ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: భూమి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో కేసీఆర్‌

ABN, Publish Date - Nov 09 , 2024 | 04:39 AM

ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

  • కేసీఆర్‌ కట్టిన యాదాద్రిలోనే సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

  • బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టును ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌/హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈ భూమి ఉన్నంతకాలం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 237 మంది లబ్ధిదారులకు రూ.54.57 లక్షల విలవైన చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి.. నేడు కేసీఆర్‌ కట్టిన యాదాద్రిలోనే పుట్టినరోజు చేసుకున్నారన్నారు. చివరికి మూసీ సుందరీకరణలో భాగంగా మంచినీళ్లను కూడా కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం నుంచి తరలిస్తామని చెప్పారని తెలిపారు.


అసలు కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ వచ్చేదా, తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. కాంగ్రె్‌సను నమ్మి ఓటేసినందుకు మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. హాస్టళ్లలో పిల్లలకు కనీసం కడుపునిండా అన్నం పెట్టలేని పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ భయపడేది లేదన్నారు. మరోవైపు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం పాదయాత్ర సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 04:39 AM