Nagarjuna Sagar: సాగర్ గేట్లన్నీ ఎత్తివేత..
ABN, Publish Date - Aug 30 , 2024 | 04:04 AM
పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది.
ప్రాజెక్టుకు 3,48,235 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
కృష్ణా జలాశయాలకు పెరుగుతున్న వరద
గద్వాల/నాగార్జునసాగర్/కేతేపల్లి/మేళ్లచెర్వు, ఆగస్టు 29 : పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి 2,94,000 క్యూసెక్కులు, శ్రీశైలం జలాశయానికి 2,86,434 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,79,830 క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌కు 3,48,235 క్యూసెక్కుల వరద వస్తోంది.
దీంతో 26 గేట్లల్లో 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర, 12 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,07,382 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక, గోదావరిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి 1.93 లక్షలు, సమ్మక్క బ్యారేజీకి 2.52 లక్షలు, సీతమ్మసాగర్‌కు 2.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు 7534 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
Updated Date - Aug 30 , 2024 | 04:04 AM