Share News

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:52 AM

హీరో రాజ్ తరుణ్- లావణ్యల లవ్ ఎపిసోడ్ రోజుకోక మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మల్వి మల్హోత్రాల మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి.

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

హైదరాబాద్: హీరో రాజ్ తరుణ్- లావణ్యల లవ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్‌ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వీ మల్హోత్రా రిప్లై ఇచ్చింది. మాల్వి అనేక సార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో రాజ్ తరుణ్, మాల్వి కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారు. రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారని చాట్‌ని స్పష్టమవుతోంది.


మాల్వీ పర్సనల్ విషయాలపై రాజ్ తరుణ్ కామెంట్స్ చాట్ ద్వారా తెలుస్తోంది. కాగా రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్య ఆరోపణలు నిజమవుతున్నాయి. రాజ్ తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఇల్లీగల్ రిలేషన్ అంటూ నర్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పర్యవసానంగా ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. మొదట హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహా పలువురిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత మాల్వీ మల్హోత్రా సైతం రంగంలోకి దిగింది. తన పరువును బజారుకు ఈడ్చుతోందంటూ.. తన తమ్ముడిని బెదిరిస్తోందంటూ లావణ్యపై మాల్వీ కేసు పెట్టింది. మొత్తానికి ముగ్గురిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రాజ్ తరుణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చడం జరిగింది. ఇక ఈ కేసు ఇలా నడుస్తుండగానే.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లావణ్య హైడ్రామా క్రియేట్ చేసింది. మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రాజ్ తరుణ్, మాల్వీల ఛాటింగ్ బయటకు వచ్చింది కాబట్టి ఏమైనా పురోగతి ఉంటుందేమో చూడాలి.

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 12:21 PM