High Court: బాచుపల్లి తహసీల్దార్‌కు ముందస్తు బెయిల్
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:39 AM
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న హైడ్రా సూచనలతో కేసు ఎదుర్కొంటున్న బాచుపల్లి తహసీల్దారు పూల్‌సింగ్‌కు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది.
హైడ్రా ఫిర్యాదుతో కేసు
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న హైడ్రా సూచనలతో కేసు ఎదుర్కొంటున్న బాచుపల్లి తహసీల్దారు పూల్‌సింగ్‌కు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. నిజాంపేట్ మున్సిపాల్టీ పరిధిలోని ప్రగతినగర్ ఎర్రకుంట బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు సహకరించారని పేర్కొంటూ పూల్‌సింగ్ సహా ఐదుగురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై హైడ్రా ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తహసీల్దార్ పూల్‌సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సుజన ధర్మాసనం.. పిటిషనర్ అక్కడ విధుల్లో చేరింది గతేడాది ఆగస్టులో మాత్రమేనని, అంతకుముందే అనుమతులు ఇచ్చారని గుర్తించింది. పిటిషనర్ ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారనే వాదనతో ఏకీభవిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Updated Date - Sep 06 , 2024 | 04:39 AM