ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాదంలోని స్థలం మూడో పార్టీకి అప్పగింత

ABN, Publish Date - Oct 30 , 2024 | 05:09 AM

ఓ స్థలం విషయమై నవాబు వారసులు, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగానే దాన్ని మూడో పార్టీకి కట్టబెడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం హైకోర్టు తిరస్కరించింది.

  • రంగారెడ్డి కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌ ఉత్తర్వులు

  • కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఓ స్థలం విషయమై నవాబు వారసులు, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగానే దాన్ని మూడో పార్టీకి కట్టబెడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం హైకోర్టు తిరస్కరించింది. అత్యంత విలువైన 52 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి డీ-నోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసింది. గుట్టలబేగంపేట్‌ పరిధిలోని సర్వే నెంబరు 63 (మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం వెనుక)లో ఉన్న 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి అమోయ్‌కుమార్‌ డీ-నోటిఫైచేశారు. సర్వే నంబర్‌లో మొత్తం 73.39 ఎకరాలు ఉండగా ఆ మొత్తం భూమిపై స్టేటస్‌ కో ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ దాదాపు మూడొంతుల భూమిని డీ-నోటిఫై చేయడమే కాకుండా వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని కోరుతూ రిజిస్ట్రేషన్లశాఖ అధికారులకు లేఖరాశారు. ఈ మేరకు 2022 ఆగస్టు 8న ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. ఈ ఉత్తర్వులు చెల్లవని, ఆ భూమి తమకు వారసత్వంగా వచ్చిందని పేర్కొంటూ రౌనాక్‌యార్‌ ఖాన్‌, బుక్త్యార్‌ఖాన్‌, వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. మరోవైపు ఇవి ప్రభుత్వ భూములని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. తాజాగా ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం యథాతథ ఉత్తర్వులు అమల్లో ఉండగా భూములను డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదంటూ వాటిని కొట్టివేసింది.

Updated Date - Oct 30 , 2024 | 05:09 AM