ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: తదుపరి దర్యాప్తులో తప్పు లేదు

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:51 AM

బీఆర్‌ఎ్‌సకు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు మొహమ్మద్‌ రహీల్‌ అమీర్‌ అలియాస్‌ రహీల్‌ (22)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.

  • ట్రయల్‌ కోర్టు ఆదేశాలను సమర్థించిన హైకోర్టు

  • మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు మొహమ్మద్‌ రహీల్‌ అమీర్‌ అలియాస్‌ రహీల్‌ (22)కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసుపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. 2022లో జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి మరణించడంతోపాటు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేసిన రహీల్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులో డ్రైవర్‌ను ఇరికించి తాను తప్పుకొన్నట్టు తాజాగా పోలీసులు భావిస్తున్నారు.


అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అమాయకుడైన డ్రైవర్‌పై కేసు పెట్టి జైలుకు పంపారని అనుమానిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై తదుపరి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇందుకు అనుమతి ఇస్తూ ఈ ఏడాది మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిన కేసును మళ్లీ రీఓపెన్‌ చేయడం చెల్లదని పేర్కొంటూ రహీల్‌ జూన్‌ 26న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కే సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రయల్‌ కోర్టు ఆదేశాల్లో ఎలాంటి తప్పులేదని పేర్కొంటూ అతని వినతిని తిరస్కరించారు.

Updated Date - Nov 03 , 2024 | 04:51 AM