Vikarabad: కారు, బొలేరో ఢీ..
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:25 AM
వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, బొలేరో వాహనం ఢీ కొన్న ఘటనలో బొలేరో ఎదురుగా వస్తున్న బైక్‌పై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందగా బొలేరో వాహనంలో ఉన్న మద్యం లోడ్ నేలపాలైంది.
బైక్‌పై పడి ఇద్దరి మృతి
వికారాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, బొలేరో వాహనం ఢీ కొన్న ఘటనలో బొలేరో ఎదురుగా వస్తున్న బైక్‌పై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందగా బొలేరో వాహనంలో ఉన్న మద్యం లోడ్ నేలపాలైంది. వికారాబాద్ పట్టణం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన రవీందర్ (45) మెడికల్ కళాశాలలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హేమంత్(25) అనంతగిరిలోని ఆయుష్ ఆస్పత్రి నిర్మాణ భవనంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఇద్దరూ రేషన్ సరుకుల కోసం వికారాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం లోడుతో వెళుతున్న బొలేరో వాహనం రాజీవ్ నగర్ నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. బొలేరో వాహనం బైక్‌పై ఎగిరిపడింది. దీంతో రవీందర్, హేమంత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రవీందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు; హేమంత్‌కు భార్య ఉంది.
మద్యం కోసంఎగబడ్డ స్థానికులు
బొలేరో వాహనంలో ఉన్న మద్యం బాక్సులు కిందపడిపోవడంతో రోడ్డు మొత్తం మద్యం ఏరులై పారింది. దీంతో వాహన రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. జనం మాత్రం మద్యం ఎత్తుకెళ్లేందుకు ఉత్సాహం చూపించారు. కారులోని వ్యక్తులు, బొలేరోలో ఉన్న వ్యక్తులు తప్పించుకోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 03 , 2024 | 03:25 AM