ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hussainsagar: ప్రజాపాలన ఉత్సవాలకు హస్సేన్‌సాగర్‌ చుట్టూ మెరుగులు

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:55 AM

ప్రజాపాలన ఉత్సవాలకు హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను మెరుగుపరిచేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లను సందర్శకులకు, పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

  • ట్యాంక్‌బండ్‌, నెక్లె్‌సరోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాట్లు

  • రూ.2కోట్లకు పైగా వ్యయం చేస్తున్న హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన ఉత్సవాలకు హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలను మెరుగుపరిచేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లను సందర్శకులకు, పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జరిగే ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించేందుకు సంసిద్ధమవుతోంది. మిరుమిట్లు గొలిపేవిధంగా లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.


  • ప్రజాపాలన ప్రజా విజయోత్సవం

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌, సచివాలయం, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌, నెక్లె్‌సరోడ్‌ పరిసరాల్లో ‘ప్రజాపాలన ప్రజా విజయోత్సవం’ పేరుతో వేడుకలను చేపట్టనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. తెలుగు తల్లీ ప్లైఓవర్‌ పిల్లర్లకు ఆకర్షణీయమైన బొమ్మలేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లకు కొత్త తారు వేయడంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నారు. రూ.60లక్షలకు పైగా వ్యయంతో హుస్సేన్‌సాగర్‌ వెంట గల ట్యాంక్‌బండ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌, నెక్లె్‌సరోడ్‌లలో మార్కింగ్‌, సైన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. డివైడర్లను, కూడళ్లను అందంగా ముస్తాబు చేయనున్నారు. రూ.65లక్షల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఈ పనులు చేపట్టింది. హుస్సేన్‌సాగర్‌ తీరాన గల సంజీవయ్య పార్కులో ఓపెన్‌ జిమ్‌ పరికరాలు, పిల్లలకు ఆట పరికరాలతో పాటు వీధి దీపాల ఏర్పాటు, పలు మరమ్మతు పనులను కూడా ఈ ఉత్సవాల్లో భాగంగానే దాదాపు రూ.80లక్షలతో చేపట్టేందుకు సిద్ధమైంది.


  • ముస్తాబుకు భారీగా ఏర్పాట్లు

డిసెంబర్‌ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సండే ఫన్‌ డే తరహాలో ట్యాంక్‌బండ్‌పైకి ఏలాంటి వాహనాలు అనుమతించకుండా ప్రజాపాలన ప్రజా విజయోత్సవం సంబరాలు చేయనున్నారు. చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌, ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించడంతో పాటు సాగర్‌లో ఆకాశం మిరుమిట్లు గొలిపేవిధంగా బాణాసంచాను కాల్చనున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 04:55 AM